గణేష్  విగ్రహా తయారీ కేంద్రాలను సందర్శించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి

0 22

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఎల్.బి.నగర్, నాగోల్ ప్రాంతాలలోని గణేష్ విగ్రహా తయారీ కేంద్రాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ మంగళవారం సందర్శించారు. విగ్రహా తయారీదారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై వారితో చర్చించారు. ఈసందర్భంగా రావినూతల శశిధర్ మాట్లాడుతూ భాగ్యనగరంలో 42 వ సామూహిక గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.   భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాలు ప్రపంచస్థాయిలో ప్రసిద్ది చెందాయని, కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్వాహకులకు పిలుపునిస్తుందని అన్నారు.  ఉత్సవాల కోసం విగ్రహాలు యధావిధిగా రూపు దిద్దుకుంటున్నాయని , గత సంవత్సరం కరోనా కారణంగా విగ్రహా తయారీదారులు తీవ్ర నష్టాలకు గురైనారు వారిని ప్రభుత్వం,   సమాజం ఆదుకోవాలి, సమాజం జరుపుకునే ఇంతపెద్ద ఉత్సవంలో విగ్రహా తయారీదారులు పాత్ర పెద్దదని తెలిపారు, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఈ సంవత్సరం జరిగనున్న వినాయక చవితి మరియు దుర్గామాత ఉత్సవాల కోసం విగ్రహాలు రూపొందిస్తున్న విగ్రహా తయారీదారుల సేవలు వెలకట్టలేనివని తెలిపారు, వివిధ ప్రభుత్వ పథకాలను విగ్రహా తయారీదారులకు వర్తింపజేసేలా ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు, విగ్రహా తయారీదారులపై పోలీసులు, రెవిన్యూ, జీహెచ్ంఎసీ C అధికారులు వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు గతంలో వెలుగు చూశాయని , అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని శశిధర్ కోరారు. ఈకార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ తో పాటు ఉత్సవ సమితి ఎల్.బి.నగర్ అసెంబ్లీ కమిటి సభ్యులు K . శ్రీనివాస్, హరి, సురేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Bhagyanagar Ganesh Utsava Samithi Secretary who visited the Ganesh Idol Manufacturing Centers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page