గ్యాదరి కిషోర్ కు స్వేరో సెగ

0 15

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:

 

మోత్కూరు  మున్సిపాలిటీ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వేరో స్టూడెంట్ యూనియన్  ఆధ్వర్యంలో మండల ఇంచార్జ్ కురుమేటి నవీన్ అధ్యక్షతన ఆగస్టు ఎనిమిదిన నల్గొండ పట్టణంలో జరిగిన “బహుజన రాజ్యాధికార సంకల్ప సభ” గ్రాండ్ సక్సస్ అయిన సందర్భంగా  ఓర్వలేక  డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర  బిఎస్పి కో-ఆర్డినేటర్ పై తుంగతుర్తి ఎం ఎల్ ఏ గాదరి కిషోర్  చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను కాల్చి నిరసన వ్యక్తం చేసారు. గాదరి కిషోర్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన నియోజకవర్గంలో దళితుల కోసం చేసిన పనులేవి. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ కేసులో  మీ వైఖరి ఏంటని, నేరేళ్ల,మంథని,అభంగపట్నం సంఘటనలు అన్ని  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగాయి కదా.. అప్పుడు మీ నాయకుడు కేసీఆర్,  మీరు ఎందుకు స్పందించ లేదు.. ఈ ఏడు సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే “దళిత బంధు” గుర్తొచ్చిందా, . కేవలం హుజురాబాద్ నియోజకవర్గంలోనే  దళితులు ఉన్నారా?  అని ప్రశ్నించారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Swaroop Sega to Gadhari Kishore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page