తల్లిని కరాటే బెల్టుతో కోసి చంపిన కూతురు

0 15

ముంబై ముచ్చట్లు :

 

చదువుకోమని తరచూ చెబుతున్న తల్లిని కరాటే బెల్టుతో గొంతు కోసి చంపిన కుమార్తె ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబై నగరంలో వెలుగుచూసింది. నవీ ముంబైకు చెందిన 40 ఏళ్ల వయసు గల తల్లి తన 15 ఏళ్ల కుమార్తెను మెడికల్ కోర్సు చదవమని కోరింది. చదువు విషయమై తల్లీ కూతురు మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. తల్లితో గొడవపడిన కుమార్తె కరాటే బెల్టుతో తల్లి గొంతు కోసి హతమార్చి ప్రమాదవశాత్తూ తల్లి మరణించిందని పోలీసులకు చెప్పింది.మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష చేయించగా మహిళ గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. దీంతో బాలికను అరెస్టు చేసి ప్రశ్నించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో బాలికపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశామని నవీ ముంబై పోలీసులు చెప్పారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: The daughter who chopped her mother to death with a karate belt

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page