తెలుగు జాతిని ఉత్తేజపరిచిన శంకరంబాడిసుందరాచారి-  ఘన నివాళ్లర్పించిన ఎమ్మెల్యే భూమన

0 11

తిరుపతి ముచ్చట్లు:

 

మనకు రాష్ట్ర గీతాన్ని అందించిన మహోన్నత వ్యక్తి శంకరంబాడి సుందరాచారి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.  శంకరంబాడి సుందరాచారి 108 వ జయంతి  సందర్భంగా స్థానిక లక్ష్మీపురం లోని శంకరంబాడి విగ్రహానికి మంగళవారం ఉదయం కరుణాకర రెడ్డి పుష్ప మాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు.  ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు.   మా తెలుగు తల్లికి  మల్లె పూదండ గీతాన్ని ఈనాటికీ తెలుగు ప్రజలను ఉత్తేజ పరుస్తోందన్నారు.   తెలుగు భాష ఉన్నంత కాలం శంకరంబాడి అందరి హృదయాల్లో నిలిచి ఉంటారన్నారు.  తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ మహోజ్వలమైన తెలుగు చరిత్ర,   సంస్కృతిని కాపాడుకోవాలని,  తిరిగి రాబోవు తరాలకు అందించడం మన కర్తవ్యం అన్నారు. యువతరం చైతన్యవంతులై తేనే నవ సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మానవ వికాస వేదిక కన్వీనర్లు సాకం నాగరాజ, శైలకుమార్ మాట్లాడారు. తుడా చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి తిరుపతి లో శంకరంబాడి  విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను  నిర్వహించారని గుర్తు చేశారు. శంకరంబాడి సుందరాచారి  సాహితీ పీఠం అధ్యక్షురాలు డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ శంకరంబాడి తిరుపతి వీధుల్లో నడియాడిన  మహాకవి  అన్నారు.  శంకరంబాడి సాహిత్యాన్ని  ప్రతి ఒక్కరూ చదవాలన్నారు.   డాక్టర్ గంగి సుహాసిని  మా తెలుగు తల్లికి మల్లె పూల దండ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో  నగర పాలక సంస్థ కార్పొరేటర్లు  ఎస్ కె బాబు,  కోటూరు ఆంజనేయులు,  తమ్ముడు గణేష్  తాళ్లూరి ప్రసాద్  పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Sankarambadisundarachari who inspired the Telugu nation- MLA Bhumana who paid a solid tribute

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page