దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

0 10

-ఆర్డిఓ రామకృష్ణ రెడ్డికి వినతి

ఆదోని ముచ్చట్లు:

 

- Advertisement -

దళిత క్రైస్తవులకు,దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించి న్యాయం చేయాలని క్రైస్తవ మత పెద్దలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని డీన్ చర్చి ఫాదర్ కోలా విజయరాజు, ఇతర గురువులు దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు క్రీస్తు కల్వరి కొండ రెవ”ఆనంద్ రాజ్ లు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారము హిందూ మతం కాకుండా క్రైస్తవ మతంలోకి మారిన దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా లేకుండా రాష్ట్రపతి  ఆర్డినెన్సు ఆగస్టు 10, 1950 సంవత్సరంలో జారీ చేయడం ద్వారా ఈ తేదీని నిరసన కార్యక్రమం గా దేశం మొత్తం ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. 1956- 1990 సంవత్సరం యొక్క ఉత్తర్వుల మేరకు దళితులు సిక్కు మతము, బౌద్ధ మతం స్వీకరించి నట్లయితే ఎస్సీ హోదా వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది .

 

 

సిక్కుమతం, బౌద్ధమతం దళితుల స్వీకరిస్తే ఎస్సీ హోదా కల్పించినప్పుడు దళిత క్రైస్తవులు, దళిత ముస్లి లు కూడా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు .మతం మారినంత మాత్రాన ,కులం ఏమాత్రం మారదని గ్రామాల్లో ఇప్పటికీ దళితులు  క్రైస్తవంలోకి మారినా  ఇప్పటికీ కుల వివక్షతకు గురి అవుతూనే ఉన్నారన్నారు. కావున బిజెపి ప్రభుత్వం చొరవ తీసుకుని పార్లమెంటులోనే చట్టం ద్వారా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలను ఎస్సీ హోదా కల్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రాయితీలను, అన్ని రాజ్యాంగ హక్కులను సమానంగా కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అలా చేయలేని పక్షంలో దేశం వ్యాప్తంగా తీవ్ర ఉద్యమాలతో హక్కులను సాధించుకోవడానికి వెనుకాడమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు, దళిత క్రైస్తవ ఉపాధ్యాయులు  బసప్ప, ప్రభుదాస్,  అమల నాథ్, గోపాల్, చౌడప్ప న్యాయవాది  అంజ నప్ప, జయరాజ్, దళిత క్రైస్తవ కార్యకర్తలు బాలరాజు, ఆంజనేయ ,భాగ్యప్ప ,గౌతమ శాంత రాజ్ ,ప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Dalit Christians should be given SC status

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page