నేటి నుండి జగిత్యాల అయ్యప్ప ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

0 10

-13న  పదునెట్టాంబడి యంత్ర ప్రతిష్ట, పడిపూజ
-ప్రతిరోజు భక్తులకు అన్నధానం
-నంభి వేణుగోపాల కౌశిక పర్యవేక్షణలో పూజలు
-ఆలయంలో పూర్తయిన ఏర్పాట్లు

జగిత్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

జగిత్యాల అయ్యప్ప ఆలయంలో నేటినుంచి 13 వరకు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిశాస్త్ర పండితులు నంభి వేణుగోపాల కౌశిక పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.దీనికిగాను ఆలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బుధవారం ఉదయం అగ్నిప్రతిష్ట, కుంభ మండల స్థాపనం, ఆరాధనం, సాయంత్రం జలాదివాసం, నవకాలషా, త్రయోదశ కలశ స్థాపనం కార్యక్రముంటాయని అయ్యప్ప సేవాసంఘం ట్రస్ట్ సభ్యులు తెలిపారు.గురువారం హోమం, ధ్యాన, పల, పుష్ప సహాయ్యాదివాసం, శుక్రవారం అష్టదశ సోపాన యంత్రప్రతిష్ట పిమ్మట పడిపూజ  ఉంటుందని అనంతరం పూర్ణహుతి, మహాదశిర్వచనం వంటిఆధ్యాత్మిక కార్యక్రమాలంటాయని వివరించారు.
హాజరైన భక్తులకు మూడురోజులపాటు అన్నదానం ఉంటుందని తెలిపారు.
ఆధ్యాత్మిక పరులు, భగవత్ బంధువులు, భక్తులు అధిఖ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అయ్యప్ప సేవాసంఘం ట్రస్ట్ పక్షాన కోరారు.

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు
శ్రావణమాసం మొదటి మంగళవారంను పురస్కరించుకొని సుబ్రహ్మణ్యస్వామికి మంగళవారం విశేష పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రావణమాశంలో ప్రతీ మంగళవారం విశేషాపూజలు నిర్వహించబడునని అయ్యప్ప సేవా సంఘం సభ్యులు తెలిపారు.
మూడు రోజుల పాటుఆలయంలో జరిగే కార్యక్రమలకు మంగళవారం సాయంత్రం ఆకురార్పణ చేశారు. పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురారోపణం, దిక్షా స్వీకారం తదితర పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో గురుస్వాములు నీలం దశరథరెడ్డి, కంచికిషన్, భక్తులు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయంలో కొలువున్న 11 మంది దేవతమూర్తులు

జగిత్యాల అయ్యప్ప ఆలయంలో 11 మంది దేవతమూర్తులు కొలువుందడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.ఏ ఆలయంలోనూ ఇంతమంది దేవతలు కొలువుదిరడం అరుదు.
సుబ్రహ్మణ్యస్వామి, గణపతి, పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్తా, నాగదేవత, శివలింగం, లక్ష్మీసమేత విష్ణుమూర్తి, పంచముఖ ఆంజనేయస్వామి, సంతోషిమాత, సాయిబాబా, ఆంజనేయుడు, నావగేహదేవతలు కొలువై ఉండి వారిని కొలిచిన భక్తులను కాపాడుతూ విశేషాపూజలందుకుంటున్నారు.అలాగే ఆలయంలో  ప్రతీ ఏటా 18 రకాల పూజ కార్యక్రమాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags: Spiritual activities at Jagittala Ayyappa Temple from today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page