పాదయాత్ర సన్నాహక ఏర్పాట్లలో నిమగ్నమైన బీజేపీ

0 13

-హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన పాదయాత్ర కమిటీ
-రూట్ మ్యాప్, సభలు, వసతి ఏర్పాట్ల కోసం స్థలాల పరిశీలన

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ఈనెల 24 నుండి చేపట్టనున్న పాదయాత్రలో భాగంగా రూట్ మ్యాప్, సభా స్థలి, రాత్రి బస చేసే ప్రాంతాలను ఖరారు చేసే పనిలో పాదయాత్ర కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి రూరల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో పాదయాత్ర కమిటీ సభ్యులు పర్యటించారు. సభా స్థలి, భోజన, వసతి, రక్షణ ఏర్పాట్ల కోసం ఆయా ప్రాంతాల్లోని  వివిధ స్థలాలను పరిశీలించారు.  పాదయాత్ర సందర్భంగా గోల్కొండ కోట, ఆరె మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్ రోడ్, చేవెళ్ల క్రాస్ రోడ్, మన్నెగూడ చౌరస్తా, వికారాబాద్, మొమిన్ పేట, సదాశివపేట ప్రాంతాల్లో ప్రజలను ఉధ్దేశించి మాట్లాడేందుకు అనువైన స్థలాలను పరిశీలించారు.  పాదయాత్ర కమిటీ సభ్యులు తమ ప్రాంతాలకు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న బీజేపీ జిల్లా నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
• బండి సంజయ్ పాదయాత్ర కోసం ప్రజలు, బీజేపీ శ్రేణులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్న బీజేపీ నాయకులు తమ తమ గ్రామాల గూండా పాదయాత్ర నిర్వహించేలా చూడాలంటూ పాదయాత్ర కమిటీలను సభ్యులను కోరారు. పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు, జన సమీకరణ వంటి అంశాల బాధ్యతలను తమకు అప్పగిస్తే వాటిని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఉత్సాహం చూపారు. వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు సైతం పాదయాత్ర కమిటీ సభ్యులను కలిసి  సంజయ్ పాదయాత్రలో తామూ స్వచ్ఛందంగా పాల్గొంటామని ముందుకు వచ్చారు. మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, పాదయాత్ర కమిటీ సహ ప్రముఖ్ లంకల దీపక్ రెడ్డి, సభ్యులు వెంకట్ రెడ్డి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ-గోషామహల్, రంగారెడ్డి రూరల్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు గౌతమ్ రావు, పాండు యాదవ్, బొక్క నర్సింహారెడ్డి, ఎం.నరేందర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి మురళీధర్ గౌడ్, అశోక్ యాదవ్, అంజన్ కుమార్ గౌడ్, దేశ్ పాండే, సాయికృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags: BJP engaged in preparatory arrangements for the pilgrimage

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page