పారదర్శకంగా పెన్షన్ లబ్దిదారుల ఎంపిక: మంత్రి ఎర్రబెల్లి

0 11

హైదరాబాద్  ముచ్చట్లు:

పెన్షన్ ను పొందేందుకు అర్హత గల వారిని ఎంపిక చేయడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అర్హులను ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనా్నరు.  తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లో ఉన్న ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ఉద్యోగుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన అన్నారు. గ్రామపంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇతర సాగునీటి వనరులను వినియోగించుకుని వర్షాకాలంలో నాటిన మొక్కల వాటరింగ్ చేయాలని ఆయన కోరారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా  చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు పనుల సోషల్ ఆడిట్ మానిటరింగ్ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి దయాకర్ రావు అదేశించారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Selection of Pension Beneficiaries Transparently: Minister Errabelli

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page