పెగాసస్ వివాదంపై సుప్రీంలో విచారణ

0 13

ఎన్వీరమణ కీలక వ్యా్ఖ్యలు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పెగసస్‌ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. ఫైల్‌ చేసిన పిటిషన్లు అన్నీ తనకు అందాయని..అయితే ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు ఎస్జీ తుషార్‌ మెహతా. అందుకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం. పెగాసస్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. కోర్టులు జరిపే విచారణలపై నమ్మకం ఉండాలన్నారు. విచారణ సమయంలో సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరమన్నారు.పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మానం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని  ధర్మానం కీలక వ్యాఖ్యలు చేశారు .కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరం. కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. కోర్టు హాళ్లలో క్రమశిక్షణతో కూడిన చర్చలు జరగాలని తామెప్పుడూ కోరుకుంటాం. వాద, ప్రతివాదులు సమాచారపరంగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. పిటిషనర్లు చెప్పాలనుకున్న విషయాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. సామాజిక మాధ్యమాలు, బయట జరిగే చర్చలకు పరిధి ఉండాలి.” అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.ఈ సందర్భంగా తమ కక్షిదారులు పరిధి దాటి వెళ్లకుండా చూస్తామని ధర్మాసనాని తెలిపారు సీనియర్ న్యాయవాదులు. కక్షిదారులు ఇష్టానుసారం చర్చలు జరపకుండా సామాజిక మాధ్యమాల్లో చర్చలకు తావివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సీజేఐ ఎన్‌వీ రమణ ఆదేశాలను పరిశీలనలోకి తీసుకోవాల్సిందేనన్నారు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ నేత కపిల్ సిబల్.విచారణ సందర్భంగా అన్ని పిటిషన్లకు సంబంధించిన నకలు పత్రాలు తమకు అందాయని కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాలని.. అందుకు కొంత సమయం కావాలని విన్నవించారు. ఈ క్రమంలో విచారణను సోమవారానికి(ఆగస్టు 16) వాయిదా వేసింది ధర్మాసం.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Supreme Court hearing on Pegasus controversy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page