మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

0 9

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం రాయికుంటపల్లి లోని చెరువు శిఖానికి సంబంధించిన ఎకరం భూమిలో గత 40 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న కొరటికంటి నర్సమ్మ అనే మహిళకు చెందిన బోరును పోలీసుల సహకారంతో రెవెన్యూ ఆఫీసర్లు సీజ్ చేసారు.  తన బ్రతుకు కు జీవనాధారమైన బోరును సీజ్ చేయడంతో ఆవేదనతో నర్సమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను హుటాహుటిన అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికే బోరు సీజ్ చేశారని ఆరోపిస్తూ మోటకొండూర్ తహశీల్ధార్ ఆఫీసు ముందు స్థానికుల ఆందోళనకు దిగారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Female farmer commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page