మ్మానాన్నను చూడకపోతే ఆర్నెల్ల జైలు  

0 15

జగిత్యాల ముచ్చట్లు:

వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ సంక్షేమాన్ని  గాలికొదిలేసే పిల్లల దుర్మార్గాలకు ఇంకా  శిక్షాకాలం పెంచనున్నారని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.సీనియర్ సిటీజన్ల పోషణ, సంక్షేమానికి సంబంధించి  చట్టంలో ప్రస్తావించిన పిల్లల  నిర్వచన పరిథిని కేంద్ర ప్రభుత్వం విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు, సీనియర్ సిటీజన్ల పోషణ, సంక్షేమానికి సంబంధించిన 2007 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఒక ముసాయిదాను తయారు చేసిందని  వివరించారు. ప్రస్తుత చట్టంలో పిల్లలు అని ఉన్న నిబంధన కుమారులు,కూతుర్లు,మనవలకు మాత్రమే వర్తిస్తుండగా, సవరిస్తున్న ముసాయిదా ప్రకారం  పిల్లల పరిథి లోకి  ఆల్లుళ్లు,కొడళ్ళు, మనవళ్లు, దత్తత తీసుకున్న  లేదా సవతి పిల్లలు, చట్టబద్ధమైన  సంరక్షకుల వద్ద ఉన్న మైనర్లు  కూడా వస్తారన్నారు.ఇప్పుడు పోషణ కు  చెల్లించాల్సిన గరిష్ట పరిమితి సీలింగ్ ఎత్తివేసి పిల్లల సంపాదన ఆధారంగా లెక్కిస్తారని,తల్లిదండ్రులను వెల్లగొట్టినా,వదిలేసినా, వారిని దూషించినా ,హింసలు పెడితున్నా ప్రస్తుతం ట్రిబ్యునల్ అధికారి అయిన రెవెన్యూ డివిజనల్ అధికారి  ప్రస్తుతం 3 నెలలు శిక్ష విధిస్తున్నారు.అట్టి శిక్షా కాల పరిమితిని ఆరు నెలలకు పెంచనున్నారని దీనికి సంబంధించిన  ముసాయిదా  పలు మంత్రిత్వ శాఖల పరిశీలన లో  ఉందని ,పార్ల మెంటులో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించడం పట్ల హరి అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,గౌరవ సలహాదారు మాజీ మున్సిపల్ చైర్మన్ జీ ఆర్.దేశాయ్, మహిళా కార్యదర్శి బోబ్బాటి  కరుణ,అలిశెట్టి ఈశ్వరయ్య, మానాల కిషన్, సింగం గంగాధర్,గొర్రె విద్యాసాగర్, పబ్బా శివానందం, దొంతుల లక్ష్మికాంతం,పి.సి.హన్మంత రెడ్డి,సత్యనారాయణ, నారాయణ, హన్మాండ్లు, నర్సయ్య, ప్రసాద్,యాకుబ్,సైఫోద్దీన్,త్యాగ రాజు,జిల్లా, డివిజన్ నియోజకవర్గ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Arnella’s prison if he does not see his uncle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page