యండమూరి వీరేంద్రనాద్ దర్శకత్వంలో హీరోగా బెనర్జీ !

0 13

హైదరాబాద్ ముచ్చట్లు:

సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు బెనర్జీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి  “అతడు, ఆమె – ప్రియుడు” అనే టైటిల్ ఖరారు చేసారు. యండమూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  అయన  ఒక ఆస్ట్రోనమి ప్రొఫసర్ గా నటిస్తున్నాడు.  ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్య క్రమాలు ప్రారంభమయ్యయి.. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ .. “…ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది.  భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ” అని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
ఈ చిత్రంలో బెనర్జీ, సునీల్, కౌశల్, సుపూర్ణ తదితరులు నటిస్తున్నారు. రచన, దర్శకత్వం : యండమూరి వీరేంద్రనాద్.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Banerjee as a hero under the direction of Yandamuri Virendranath!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page