రాబోయేది తెలుగుదేశం పార్టీ

0 12

-ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
-విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి

 

మంత్రాలయం ముచ్చట్లు:

 

- Advertisement -

రాబోయేది తెలుగుదేశం పార్టీ అని మళ్ళీ చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి అవుతారని ఈసారి మా నాన్నతిక్కారెడ్డి   మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రచ్చమర్రి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో కొత్త విగ్రహ ఏర్పాటు ఆవిష్కరణ కార్యక్రమ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ  జగన్ మోహన్ రెడ్డి పాలన అభివృద్ధి  కాకుండా అప్పుల  ఆంధ్ర ప్రదేశ్ అయ్యిందని అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.  తెలుగు ప్రజలందరూ  జగన్మోహన్ రెడ్డికి  ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని అన్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ అని తెలుగు దేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Upcoming Telugu Desam Party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page