రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

0 19

బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన

కోరుట్ల    ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ బీజేవైఎం కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నంది చౌరస్తా వద్ద బీజేవైఎం నాయకులు చెప్పులు కుడుతూ, బూట్లు పాలిష్ చేస్తూ వినూత్నంగా నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం బీజెవైఎం జిల్లా కార్యదర్శి  సాడిగే మహేష్ ,పట్టణాధ్యక్షుడు ప్రవీణ్ సింగ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ తెరాస ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని,నిరుద్యోగులకు ముప్పై రెండు నెలల నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగేలా నిరుద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేణీ మహేష్, మొలుమురి రాజ మురళి,పట్టణ ప్రధాన కార్యదర్శిలు గిన్నెల శ్రీకాంత్, సీనియర్ నాయకుల చెన్నమనేని రంజిత్ రావు,  బీజెవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు గొనేలా రాజశేఖర్, కంఠం శ్రీనివాస్, వోటరీకరి నవీన్, రాగంశెట్టి సాయికృష్ణ, నడికట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Vacancies in the state should be filled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page