రేవంత్ సంచులు మోసి.. పదవులు తెచ్చుకున్నారు

0 13

హైదరాబాద్  ముచ్చట్లు:
గత 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడమే కాకుండా ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలను సైతం ఆపరేషన్ ఆకర్ష్‌‌తో తన వైపు తిప్పుకుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన సీనియర్ నేతలు సైతం వెంటనే గులాబీ కండువా కప్పుకుని ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కించుకున్నారు. అలాంటి వారిలో నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన లింగయ్య ఎన్నికైన కొద్ది నెలలకే టీఆర్‌ఎస్ పార్టీకి జై కొట్టారు.అంతవరకూ బాగానే ఉన్నా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో అసలు కథ మొదలైంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రేవంత్ విరుచుకుపడుతుండడం సదరు ఎమ్మెల్యేకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఘాటు వ్యాఖ్యలతో రివర్స్ కౌంటరిచ్చేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. గతంలోనూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటు సమాధానమిచ్చారు. తాజాగా మరోమారు రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.రేవంత్ రెడ్డి సంచులు మోసి పదువులు తెచ్చుకున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు లింగయ్య. దళిత బంధును రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కనిపిస్తే ఉమ్మి వేసేందుకు దళితులు చూస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో రేవంత్ మాటలు విని ఆ పార్టీలో కొనసాగుతున్న నేతలే నోరెళ్లబెడుతున్నారని.. ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, భట్టి ఆశ్చర్యపోయారని లింగయ్య అన్నారు. రేవంత్ సంస్కారంతో మాట్లాడాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు..

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Rewanth cheated bags .. got positions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page