వల్లివేడు పంచాయతీ ఎస్.టి కాలనీలో నాటుబాంబులు కలకలం

0 22

భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డ ఎస్.టి కాలనీవాసులు
మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అక్కడి ఇండ్లపై నాటుబాంబులు వేస్తానని వీరంగం
చిత్తూరు  ముచ్చట్లు:
నాటు బాంబు పేలి తృటిలో  ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన పాకాల పోలీసులు ఒక బ్యాగ్ కవర్ లో ఉన్న పది నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు పంచాయతీ ఎస్.టి కాలనీలో యానాది కృష్ణయ్య(47) నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో మద్యం సేవించి నాటు బాంబులతో కలకలం సృష్టించాడు.మద్యం మత్తులో ఒక నాటు బాంబు కింద వేయడంతో వెంటనే పేలిన ప్రమాదం చోటు చేసుకుంది. నాటు బాంబు పేలిన ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ఇతను మద్యం మత్తులో పక్క వాళ్లను దూషించి,మీ ఇళ్లపై నాటు బాంబులు వేస్తానని బెదిరించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటనా స్థలానికి పాకాల పోలీసులు చేరుకుని పరిశీలించారు.నిందితుడు పరారీలో ఉన్నాడు.పాకాల పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Minas terrestres en Vallivedu Panchayat ST Colony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page