వాహనంతో సహా కోటి రూపాయలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

0 17

-వాయల్పాడు, పీలేరు సి ఐ  ల ఆధ్వర్యంలో క్యూబింగ్

 

చిత్తూరు ముచ్చట్లు:

 

- Advertisement -

కె.వి పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు మదనపల్లి డిఎస్పి రవి మనోహర్ ఆచారి ఆధ్వర్యంలో వాయల్పాడు సీఐ నాగార్జున రెడ్డి,  పీలేరు సీఐ సాధిక్ అలీ తమ సిబ్బందితో కలిసి నూతన కాలువ అటవీ ప్రాంతాలలో తనిఖీలు చేయగా ఈచర్ వాహనం ఆపకుండా ప్రయత్నించగా వాహనాన్ని వెంబడించి వాహనంతో సహా 23  మంది ఎర్ర కూలీలను క్లీనరు,  మేస్త్రి ని అదుపులోకి తీసుకున్నారు,  వీరందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు . టమాటా ట్రేల మద్యలో   ఉన్న 41 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసి  కూలీలను  రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు , పోలీస్ విచారణలో ఇంకా పది మందిపై కేసు ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో తో వారిని కూడా త్వరలోనే అరెస్టు చేశామని తెలిపారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags: Seized red sandalwood worth crores of rupees including vehicle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page