వ్యవసాయరంగ బలోపేతమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యం

0 11

రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి
హైద‌రాబాద్ ముచ్చట్లు:
వ్యవసాయరంగ బలోపేతమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. వ్య‌వ‌సాయం ఒక ప‌రిశ్ర‌మ‌గా వర్ధిల్లాల‌ని.. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ స‌బ్ క‌మిటీ న‌గంర‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మై వ్యవసాయరంగంపై చ‌ర్చించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైనది వ్యవసాయ రంగం అన్నారు. తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న‌ట్లు చెప్పారు. అత్యధిక శాతం ప్రజలకు వ్య‌వ‌సాయ రంగం ఉపాధి కల్పిస్తున్నదన్నారు. రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాలన్నారు. ఆహారం లేనిది జీవరాశి మనుగడ లేదని.. ఆహారానికి ప్రత్యామ్నాయం లేద‌న్నారు. ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే వ్యవసాయరంగం మీద సీఎం దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. చైనాలో అత్యధిక ఉత్పత్తి ఉన్నా అవి ఆ దేశ అవసరాలకే సరిపోతున్నాయన్నారు. కేవలం సిల్క్ మాత్రమే ఆ దేశం ఎగుమతి చేస్తుందన్నారు. రైతుకు మించిన శాస్త్ర‌వేత్త లేడ‌ని మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. స‌మ‌స్త స‌మాచారం ల‌భించేలా రైతు స‌మీకృత కేంద్రాలుగా రైతు వేదిక‌లు నిల‌వాల‌న్నారు. అగ్రి స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. వరి ధాన్యం నుండి ఇథనాల్ గా మార్చే పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసే విషయం పరిశీలిద్దామ‌న్నారు. స్థానికంగా విత్తన లభ్యత ఉంటే ఆలుగడ్డ సాగును తెలంగాణలో విస్తృతంగా పెంచుకోవచ్చ‌న్నారు. తెలంగాణ వచ్చేనాటికి వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.40 వేల కోట్లు కాగా, నేడు ఆ ఉత్పత్తుల విలువ రూ.94,500 వేల కోట్లకు చేరుకోవ‌డం ఆనందదాయకం అన్నారు.ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు హాజ‌ర‌య్యారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:The aim of the Telangana government is to strengthen the agricultural sector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page