శవాలపైన పేలాలు ఏరుకుంటున్న రేవంత్ రెడ్డి

0 6

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో  నోటి తీటను తీర్చుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ను తిట్టి శునకానందం పొంది సభను ముగించారు. రేవంత్ రెడ్డి చరిత్రను మరిచి చాలా మాటలు మాట్లాడారు. 1981లో ఇంద్రవెళ్లి లో వందలమంది ని పిట్టలను కాల్చినట్లు కాల్చిన పార్టీ కాంగ్రెస్.  ఇందిరాగాంధీ సాక్షిగా వందలమంది ఆదివాసుల బిడ్డలను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్  ది. కాంగ్రెస్ సభను చూస్తుంటే గిరిజనుల గుండెలు మండినవి. ఆనాడు గిరిజనులను చంపి- ఇవ్వాళ స్మారకం కడతారా?   శవాల పై పేలాలు ఎరుకునే రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు బిక్షతో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని అన్నారు. ప్రజలు ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలో రేవంత్ వివరణ ఇవ్వాలి. రోజుకో మాట- పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డిని నమ్మలా?  సోనియాగాంధీ రాజ్యం అంటే- వందల మంది యువత ఆత్మబలిదానం చేసుకున్న రాజ్యం కావాలా? 2009 వరకు తెలంగాణ ఇవ్వకుండా లాగి లాగిన ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న  సోనియమ్మ ను నమ్మలా? సోనియా గాంధీ దయ్యం- బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇవ్వాళ తెలంగాణ తల్లి సోనియాగాంధీ అంటుండు. దళితుల పేరుతో ఓట్ల డ్రామా కాంగ్రేస్ పార్టీ ఆడుతుంది.

 

 

- Advertisement -

రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్ట్.  దళితుల అభివృద్ధి కోసం కాంగ్రేస్ పార్టీ దేశం- రాష్ట్రంలో ఒక్క పథకం తెచ్చిందా అని ప్రశ్నించారు.  60ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క దళిత వ్యక్తిని ప్రధాని చేసిందా?  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని సీఎం చేసిందా?  రేవంత్ రెడ్డి- కాంగ్రెస్ లాగా  టీఆరెస్ డ్రామా కంపెనీ కాదు. 70ఏళ్ల రాజకీయ చరిత్రలో దళితబంధు లాంటి పథకాలు తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ వేషాలు వేస్తున్నాడు. హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని రేవంత్ గెలిపించే  దమ్ముందా..  హుజురాబాద్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఉడిపోతుందని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా వలసపాలకుల పంజరంలో ఆంధ్రనేతల కోసం పలికే చిలుక.  ఇంతకు ముందు చెర్లపల్లికి టెంపరేర్రిగా వెళ్లిన రేవంత్ రెడ్డి ఇక పూర్తిగా జైల్ పాలు కానున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని బుడ్డర్ ఖాన్ వేషాలు వేసినా కేసీఆర్ కాలు గోటికి సరిపొడని అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags: Rewanth Reddy picking popcorn on corpses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page