సునీల్ యాదవ్ ను ఇరికిస్తున్నారు

0 18

కడప ముచ్చట్లు:
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. ఈ కేసులో సీబీఐ మరింత దూకుడుగా వెళుతుండగా.. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు పెద్ద నాయకులు తన అన్నని ఇరికిస్తున్నారని ఇదే కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌ తమ్ముడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆ పెద్దవాళ్ళు, సీబీఐ అధికారుల నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందన్నారు.వివేకాను హత్య చేసిందోవరో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజలకు తెలుసన్నారు కిరణ్. సీబీఐ అధికారులు లేనిపోనివి సృష్టిస్తున్నారని.. అందులో భాగంగానే కాలువలో మారణాయుధాలు ఉన్నాయని వెతికిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సునీల్‌ని నిందితుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని.. కేసులో అసలు నిందితులు బయటపడతారనే భయంతోనే కడప మేయర్‌ సురేష్‌బాబు ఎస్పీని కలిసి ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు సమర్పించారన్నారు. రెండేళ్లుగా మాట్లాడని వాచ్‌మన్‌ రంగన్న ఇప్పుడెందుకని సునీల్‌ పేరును వాంగ్మూలంలో చెప్పారని ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తులో తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని సీఎంను కలిసి చెప్పాలనుకుంటే సీబీఐ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వివేకా, సునీల్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలు లేవని.. ఆయన రెండు, మూడుసార్లు తమ ఇంటికి కూడా వచ్చారన్నారు. ఈ కేసులో వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సునీల్‌ని ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుతో సునీల్‌కు కానీ, తమకు గాని ఎలాంటి సంబంధం లేదన్నారు..

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Sunil Yadav is being placed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page