అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బాంబు కలకలం..

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

హైదరాబాద్ అమీర్‌పేటలోని మెట్రో స్టేషన్‌లో బాంబు కలకలం రేగింది. బాంబ్‌స్క్వాడ్ ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అనుమానిత వస్తువు బాంబు కాదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మెట్రో స్టేషన్‌లో ఆదిత్య ఎన్‌క్లేవ్‌వైపు ఉన్న చెత్త డబ్బాలో అనుమానిత వస్తువేదో ఉన్నట్టు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. దానిని బాంబుగా భావించి పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం అందించారు. బాంబ్‌స్క్వాడ్, ఎస్సార్ నగర్ పోలీసులు క్షణాల్లోనే స్టేషన్‌కు చేరుకుని తనిఖీ చేశారు. పోలీసు జాగిలం సాయంతో చెత్తడబ్బాలో గాలించగా సెల్‌ఫోన్ లభ్యమైంది. ఆ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Bomb blast at Ameerpet metro station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page