అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం.. 25 మంది సైనికులు సహా 42 మంది మృత్యువాత

0 10

అల్జీరియా ముచ్చట్లు :

 

ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది సైనికులు సహా 42 మంది సజీవ దహనమయ్యారు. ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వాతావరణం కారణంగా అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనలో కనీసం 42 మంది మరణించారని అధికారులు తెలిపారు. వీరిలో 25 మంది సైనికులు కాగా, 17 మంది సాధారణ పౌరులని పేర్కొన్నారు. రాజధాని అల్జీర్స్‌కు తూర్పున ఉన్న కబీలీ ప్రాంతమైన కొండలపై మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వందమందికిపైగా ప్రజలను సైన్యం రక్షించింది. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: A deadly fire in Algeria kills 42 people, including 25 soldiers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page