ఒళ్లు దగ్గర పెట్టుకో… రేవంత్ కు తలసాని వార్నింగ్

0 13

హైదరాబాద్  ముచ్చట్లు:
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు టీఆర్‌ఎస్ మంత్రులు. ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడతారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి చెందిన సీనియర్ నాయకుడు, మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ మరో అడుగు ముందుకేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జనం కనిపించారని, మీడియా.. పేపర్లలో వస్తుందని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.రేవంత్‌‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేం హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినం.. ఇక్కడ మాకంటే బలవంతుడెవడుంటడు. మేము అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అంటూ తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. రాజకీయ నాయకులు కొన్ని సంప్రదాయాలు పాటించాలన్నారు. ఇలాంటి వారి వల్లే రాజకీయ నాయకులకు విలువ లేకుండా పోతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.అలాగే దళిత బంధు, గొర్రెల పంపిణీపై కూడా తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు హుజూరాబాద్‌ నుంచి శ్రీకారం చుడదామని కేసీఆర్ అనుకున్నారని.. విపక్ష నేతలు రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేయడంపై తలసాని సెటైర్లు వేశారు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్ చేసిన పథకమని.. క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేయడమేంటోనని ఆయన ఎద్దేవా చేశారు.గొర్రెల పంపిణీ కూడా నాగార్జున సాగర్‌లో.. హుజూరాబాద్‌లో చేస్తున్నారని కొందరు అసత్యాలు మాట్లాడుతున్నారని తలసాని అన్నారు. కొన్ని పత్రికలు కూడా కథనాలు రాస్తున్నాయని చెప్పారు. ఒకసారి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో సర్వే చేయాలని.. లేకుంటే తమ శాఖ అధికారులను అడిగితే వివరాలు అందిస్తారని ఆయన చెప్పారు. అన్ని చోట్లా గొర్రెల పంపిణీ పథకం అమలు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Keep the years close … Talasani warning to Rewanth

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page