కరోనా కట్టడి ప్రభుత్వాలకు సవాలుగా మారింది – కమీషనర్ పిఎస్ గిరీషా

0 12

-స్వతంత్రంగా ఐసోలేషన్ కేంద్రం నడపడం అభినందనీయం – ఏఎస్పీ సుప్రజ

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

కరోనా మహమ్మారి అరికట్టడానికి ప్రభుత్వాలు చాలా శ్రమించాల్సి వస్తోందని, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే అది సాధ్యపడుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ పిఎస్ గిరీషా పేర్కొన్నారు. బుధవారం తిరుపతి అర్బన్ మండలం మంగళం పరిధిలోని రణధీర్ పురం పంచాయతీలో కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో జూన్ 6 నుండి ఆగష్టు 11వ తేదీ వరకు 63 రోజుల పాటు నిర్వహించిన ఉచిత ఐసోలేషన్ సెంటర్ ముగింపు కార్యక్రమం బుధవారం ఉదయం బిటిఆర్ కాలనీలో నిర్వహించారు. కొరటాల ట్రస్ట్ కన్వీనర్ మల్లారపు నాగార్జున అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నగరపాలక సంస్థ కమిషనర్ PS గిరీషా మాట్లాడుతూ కరోనా కట్టడి ప్రభుత్వాలకు ఒక దశలో సవాలు గా మారిందన్నారు. మొదటి దశ కన్నా రెండవ దశలో ఎక్కువ శాతం మరణాలు సంభవించాయన్నారు. తిరుపతి నగర పరిధిలో ఉన్న రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 4 ఐసోలేషన్ సెంటర్ లు చాలా ఉపయుక్తంగా పని చేసాయన్నారు. మూడవ వేవ్ లో స్వచ్చందంగా ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి కరోనా కట్టడికి సహకరించాలని, అందుకు తమ వంతుగా నగరపాలక సంస్థ నుండి ఎటువంటి సహకారం అయినా అందిస్తామన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఏఎస్ పి సుప్రజ మాట్లాడుతూ కరోనా ప్రారంభం నుండి దినసరి కూలీలు, చిరు వ్యాపారులు తమ బ్రతుకుదెరువు నిమిత్తం చేసే పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందనే కారణంతో ప్రజలు అజాగ్రత్తగా మెలుగుతూ మాస్కులు, భౌతిక దూరం పాటించకపోవడంతో కేసులు పెరిగి అత్యధిక మరణాలు సంభవించాయని అభిప్రాయపడ్డారు. స్వతంత్రంగా కోవిడ్ ఉచిత ఐసోలేషన్ సెంటర్ ను నిర్వహించడం పై నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాల తోడ్పాటుతో 23 ఐసోలేషన్ సెంటర్లను నిర్వహించామన్నారు. ఇప్పటికీ విజయవాడ కేంద్రంలో ఉచిత ఐసోలేషన్ సెంటర్ నడుస్తోందన్నారు. 1475 పడకల ఉచిత ఐసోలేషన్ సెంటర్ లను వివిధ సంఘాల సహకారంతో నడపగలిగామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఐసోలేషన్ సెంటర్ ల సంఖ్యను కూడా పెంచామన్నారు.

 

 

 

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ ప్రజలకు కష్టమంటే కమ్యూనిస్టులు ఎన్నడూ ముందుంటారన్నారు. ఈ రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం మీద ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అన్నారు. ఈ సెంటర్ నిర్వహణకు మొదట్లో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినా దాతల సహకారం మెండుగా అందించారన్నారు. కేవీ చౌదరి లాంటి పారిశ్రామికవేత్తలు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, టిటిడి ఉద్యోగ సంఘం నేతలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఐసోలేషన్ సెంటర్ నిర్వహణలో ప్రధాన భూమిక పోషించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ సొంత వారే కరోనా వచ్చిందని నెపంతో సొంత వారి శవాలను కూడా వదిలిపెట్టి వెళుతున్న సమయంలో ఎంతో అంకితభావంతో కరోన రెండవ దశలోనూ తమ కర్తవ్యంగా ఉచితఐసోలేషన్ సెంటర్ నిర్వహించామన్నారు. దాదాపు 80 శాతం పైగా ట్రస్ట్ కన్వీనర్ మల్లారపు నాగార్జున తన సహకారంతోనే ఐసోలేషన్ కేంద్రం సేవలు పూర్తిస్థాయిలో కోవిడ్ రోగులకు అందాయన్నారు. డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఉద్యమ భావాలను నేర్పించిన సిపిఎం పార్టీ చేసే సేవా కార్యక్రమాల్లో తానెప్పుడు ముందు ఉంటానని స్పష్టం చేశారు. తన తల్లిలాగే తాను కూడా ప్రజల సేవలకు ఎల్లప్పుడు ముందుంటానని డాక్టర్ శ్రావ్య తెలిపారు. పారిశ్రామికవేత్త కేవీ చౌదరి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఉచిత కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను నిర్వహించిన వారందరిని అభినందిస్తున్నానన్నారు.

 

 

 

 

ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే కరోనా మహమ్మారి పెరుగుతొందన్నారుకార్మిక సంఘాలు, ప్రజాసంఘాల సౌజన్యంతో ఉచిత సెంటర్లో దాదాపుగా 50 మంది సంపూర్ణ ఆరోగ్యంతో వారి ఇళ్లకు చేరారని, సేవలు అందించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి గాయకుడు జగన్ కొరటాల ట్రస్ట్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత ఐసోలేషన్ సెంటర్ సేవలను గానం చేశారు. అనంతరం ఉచిత ఐసోలేషన్ సెంటర్ లో సేవలందించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు, నిర్వహణలో సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నేత ఎ పద్మజ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మీ, ప్రజా నాట్య మండలి రాష్ట్ర నాయకులు పులిమామిడి యాదగిరి, టీటీడీ ఎంప్లాయిన్ బ్యాంకు డైరక్టర్ వెంకటేశం, dyfi నాయకులు జయచంద్ర, సుబ్రహ్మణ్యం ,లక్ష్మి , బుజ్జి , జయంతి, రణధీర పురం ఉపసర్పంచ్ మల్లె మొగ్గల ఉమాపతి, BTR కాలనీ నాయకులు మునిరత్నం, శ్రీనివాసులు, హెచ్ 2 ఓ నిర్వాహకులు మణికంఠ, ప్రజాశక్తి మాజీ మేనేజర్ వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Corona tightening has become a challenge for governments – Commissioner PS Girisha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page