కారు దగ్ధం కేసులో అరెస్ట్

0 9

మెదక్  ముచ్చట్లు:

మెదక్ కారు దగ్ధం కేసులో ముగ్గురి అరెస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలుమెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో కారు దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు. కారులో డెడ్‌బాడీ మిస్టరీ వీడిపోయింది. మెదక్‌లో జరిగిన రియల్టర్‌లో మర్డర్‌లో ఒక్కొక్క వాస్తవం బయటకు వచ్చేస్తోందిమెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో కారు దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు. కారులో డెడ్‌బాడీ మిస్టరీ వీడిపోయింది. మెదక్‌లో జరిగిన రియల్టర్‌లో మర్డర్‌లో ఒక్కొక్క వాస్తవం బయటకు వచ్చేస్తోంది. ధర్మకారి శ్రీనివాస్ హత్యకు కారణం మగువలు, వివాహేతర సంబంధాలు కారణం కాదని.. పూర్తిగా వ్యాపార లావాదేవీలు హత్యకు కారణంగా తేల్చేశారు పోలీసులు. లోన్‌గా తీసుకున్న డబ్బులు శ్రీనివాస్ చెల్లించలేదన్న కోపంతో దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దారుణానికి ఒడిగట్లు అనుమానిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.శ్రీనివాస్‌కి, మెదక్‌కి చెందిన ఓ వ్యక్తికి మధ్య రూ.కోటిన్నర డీల్ కుదిరింది. లోన్ తీసుకుని ఇచ్చిన ఆ డబ్బును శ్రీనివాస్‌ దశలవారీగా, రూ.15లక్షలు చెల్లించేయాలన్నది డీల్‌గా తెలుస్తోంది. కానీ ఆ డబ్బు ఎంత అడిగినా ఇవ్వకపోవడంతోనే శ్రీనివాస్‌ను చంపేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. కారులో 4.45 నిమిషాల ప్రాంతంలోనే శ్రీనివాస్‌ని కత్తితో పొడిచి, ఆ తర్వాత డెడ్‌బాడీని పెట్టుకునే నిందితులు 6గంటలపాటు కారులో తిరిగారు. ఆనవాళ్లు లేకుండా చెయ్యడం ఎలా అని పదేపదే ఆలోచించినప్పుడు వాళ్ల క్రైమ్ బ్రెయిన్స్‌కి తట్టిన ఆలోచన దగ్దం. అవును, ఆ ఆలోచనతోనే మంగలపర్తిలో కారును దగ్దం చేశారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Arrested in car burning case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page