కేసీఆర్ ది గుండెనా…బండనా

0 5

హైదరాబాద్ ముచ్చట్లు:

 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు ఫీల్డ్ అసిస్టెంట్ల అందోళనకు మద్దతు పలికారు. ధర్నా  చౌక్  కు వచ్చి వారిని పరామర్శించారు. షర్మిల మాట్లాడుతూ ఇక్కడకు  వచ్చిన వాల్ల లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ కొద్దీ కాలం క్రితం చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యు లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు సంపాదించినది కేసీఆర్ కుటుంబం మాత్రమే. తెలంగాణ లో ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. కేసీఆర్ కి ఉద్యోగం ఇవ్వడం చేతకాదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసివేస్తున్నాడు. కేసీఆర్ గారూ, నీది గుండె నా  అది బండా. కార్మిక మంత్రిగా పని చేసిన కేసీఆర్ కు కార్మికుల సమస్యలు తెలియవా అని ప్రశ్నించారు. నిజానికి కేసీఆర్ ఉద్యోగం పీకాలి. ఆయన కు పాలించే అర్హతలు లేదు. ప్రశ్నించట ము తెలంగాణ నినాదం. కేసీఆర్ ప్రశ్నించే వాళ్ళను అణచివేస్తున్నారు. సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగుల ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.  ఆర్టీసీ లో యూనియన్ లు లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు , మంత్రుల కు కేసీఆర్ ఆపోయింట్ దొరకదు.  కేసీఆర్ ఒక నియంత లా గా పాలిస్తున్న డు. పెద్ద దొర, చిన్న దొర పర్యటన కు వస్తున్నా రంటే రెండు రోజుల ముందే ప్రశ్ని0చే గొంతు లను అరెస్ట్ చేస్తున్నారు. ఆడవాళ్లము కదా అని ముందుకు వస్తే కుక్కల లాగా ఎందుకు మొరుగు తున్నారని హేళన చేస్తున్నారు.  ఆడవాళ్లు అని కనీస మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఇతనా మన ముఖ్యమంత్రి. ఎందుకు కేసీఆర్  మిమ్మల్ని ప్రశ్నిస్తే అంత కోపం. మీరు దొరలు అనుకుంటున్నారా.

 

 

- Advertisement -

ప్రజలు మీ బానిసలు అనుకుంటున్నారా. ఫీల్డ్ అసిస్టెంట్ లను నియామకాలు చేసింది వైఎస్ ఆర్. నిన్ను ప్రశ్నించటానికి వచ్చాను.  నిలదీయటానికి వచ్చాను. అందరికీ అండ గా ఉంటాను.  ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కొరకే కాదు, ఆరోగ్య శ్రీ కోసం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం, రైతు ల కోసం,  తొలగించబడిన నర్సుల కోసం పోరాటం చేస్తానని అన్నారు. యాబై నాల్గు లక్ష ల మందికి పని కల్పించది ఫీల్డ్ అసిస్టెంట్ లు. ఎవరు అడిగారని ఎమ్మెల్యే లకు జీతాలు పెంచారు.  ఇప్పటికే యాబై మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు చనిపోయారు. తెలంగాణ ఉద్యమం లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని చెప్పావు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్న వు.  ఎవరికైనా న్యాయం చేసావా. ఏ ఒక్క హామీ అయిన నిలబెట్టుకున్నవా అని అడిగారు. కేసీఆర్ నీ  మాయల మరాఠీ మాటలు ఇక చెల్లవు. వెంటనే నీవు రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి. వెంటనే తీసివేసిన 7600 ఫీల్డ్ అసిస్టెంట్ ల ను విధుల లోకి తీసుకోవాలి. వెంటనే వాళ్లకు 17 నెలల జీతాలు ఇవ్వాలి. కొన్ని రోజులు ఓపిక పట్టండి. రాజన్న రాజ్యం వస్తుంది. మీ అందరికీ న్యాయం జరుగుతుంది. చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ ల కుటుంబ ము ఒక్కొక్క రికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున ఇరుబది ఐదు వేల చొప్పున విరాళం ఇస్తున్నామని అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:KCR The Gundena Bandana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page