క్రికెట్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు..

0 10

కువైత్ ముచ్చట్లు :

 

కువైత్ క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న కువైత్ కేరళ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. సులైభికత్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎఫ్ఎఫ్‌సీకి ఆడుతున్న రెని జాకబ్ అనే భారతీయ వ్యక్తి గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఫీల్డిండ్ చేస్తున్న సమయంలో జాకబ్‌కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. జాకబ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Collapsed on the cricket field

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page