గల్ఫ్ బాధితులపై అధికారులు నిర్లక్ష్యం వీడాలి

0 8

సామాజిక కార్యకర్త షేక్ చాంద్ పాషా వినతి

జగిత్యాల ముచ్చట్లు:
గల్ఫ్ బాధితులపై, గల్ఫ్ లో మృతిచెందిన కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఎన్నారై సెల్,
స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని, ఇలాంటి చర్యలతో గల్ఫ్ బాధిత కుటుంబాలు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయిని సామాజిక కార్యకర్త, గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
షేక్ చాంద్ పాషా అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రం ప్రకటన విడుదల చేశారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన పాకాల మల్లేశ్వరి భర్త పాకాల సత్తన్న 2016లో గల్ఫ్ లో జరిగిన యాక్సిడెంట్ లో మృతిచెందాడన్నారు. 2017లో మృతుడు సత్తన్నకు రావాల్సిన లీగల్ డ్యూస్ పెండింగ్ లో
ఉన్నాయన్నారు. వీటిపై అప్పుడే దరఖాస్తు చేసుకొన్న నేటికి పరిహారం అందలేదన్నారు. దీంతో బాధిత కుటుంబికులు
తనను ఆశ్రయించగా సమస్యపై లోతుగా అధ్యయనం చేసి భారత రాయభార కార్యాలయం ద్వారా మృతుడికి రావాల్సిన పరిహారం వివరాలను సేకరించానన్నారు. మృతులు కుటుంబాలకు సకాలంలో పరిహారం అందించేందుకు కృషిచేయాల్సిన తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులు, స్థానిక అధికారులు గల్ఫ్ బాధితులపై చూపిన నిర్లక్ష్యం మూలంగా నేటికి పరిహారం అందలేదని చాంద్ పాషా అవేదన వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా జగిత్యాల జిల్లాలో పదిహేను కుటుంబాలు ఇలాంటి కారణాలతోనే పరిహారం అందక ఎదురు చూపులు చూస్తున్నారన్నారు. గల్ఫ్ సమస్యలపై, నకిలి ఏజంట్ల వ్యవస్థపై నిరంతర పోరాటం చేసిన స్పూర్తితో గల్ఫ్ బాధితులకు అందాల్సిన పరిహారంపై నిరంతర పోరాటం చేస్తానని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించే వరకు పోరాడుతానని ఈ సందర్భంగా చాంద్ పాషా తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ఎన్నారై సెల్, స్థానిక అధికారులు బాధిత గల్ఫ్ కుటుంబాలకు అండగా నిలవాలని చాంద్ పాషా కోరారు. ఆయన వెంట మృతుడు సత్తన్న కుటుంబీకులు వున్నారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Authorities should ignore Gulf victims

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page