గులాబీ గెలిస్తే… అభివృద్ది : హరీష్

0 7

కరీంనగర్ ముచ్చట్లు:

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం.. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి అని హుజురాబాద్ ప్రజల్ని కోరారు మంత్రి హరీశ్ రావు. ఈటల ఓటమి భయంతో తండ్రి లాంటి కేసీఆర్‌ను, తనను అరేయ్.. ఒరేయ్ అంటున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఇవాళ హుజురాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు.బీజేపీలో చేరిన తర్వాత ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నారని హరీశ్ అన్నారు. తనకు అన్నం పెట్టి, అక్షరాలు నేర్పి, ఇన్ని పదవులిచ్చిన కేసీఆర్ ను పట్టుకుని “రా” అని సంబోధిస్తున్నాడని తెలిపారు. అతనిలా.. తాను సంస్కారం తగ్గించుకోవాలనుకోవడంలేదన్నారు. ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరారన్నారు హరీశ్. “నీ భాష మారినా.. మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం” అని హరీశ్ అన్నారు. “నీవు అట్లా మాట్లాడావంటే..నీలో ఓటమి ప్రస్టేషన్ కనిపిస్తోందని మాకు అర్థమైంది” అని హరీశ్ వ్యాఖ్యానించారు.సీఎం గారి ఆశీస్తులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని హరీశ్ జోస్యం చెప్పారు. ప్రజలు‌ కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం. ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి. అంటూ హరీశ్ హుజురాబాద్ ప్రజల్ని అడిగారు. హుజురాబాద్‌లో రాజేందర్ గెలిస్తే.. ఒక్క వ్యక్తిగా ఆయన గెలుస్తాడు. ప్రజలుగా మీరంతా ఓడిపోతారన్నారు మంత్రి హరీశ్ రావు. మీరు గెలుస్తారా? ఆయనను వ్యక్తిగా గెలిపిస్తారా? అని ప్రజల్ని ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే ఈటల పని అయిపోయిందన్న హరీశ్.. హుజురాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలంటే TRS ను గెలిపించాలన్నారు
భారీ ర్యాలీ
హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటించిన నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. రేపోమాపో ఎన్నిక నోటిఫికేషన్‌ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు జోరు పెంచాయి. ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తర్వాత తొలిసారి ఇవాళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ట్రబుల్‌ షూటర్ హరీష్‌రావు ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లూ తెరవెను మంత్రాంగం నడిపిన ఆయన.. ఇప్పుడు డైరెక్టుగా ఫీల్డ్‌లోకి దిగారు.హుజూరాబాద్ నియోజకర్గంలోకి భారీ ర్యాలితో ఎంటర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. మంత్రి గంగుల కమలాకర్ తోపాటు కొప్పుల ఈశ్వర్‌లు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో మంత్రి హరీష్ ‌రావుకు కేడర్‌ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. కేసీ క్యాంప్ నుంచి.. జమ్మికుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో మంత్రి హరీష్ ‌రావుకు కేడర్‌ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. కేసీ క్యాంప్ నుంచి.. జమ్మికుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.హుజురాబాద్‌ చౌరస్తాకు చేరుకున్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ముందుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.హుజురాబాద్‌ చౌరస్తాకు చేరుకున్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:If Rose wins … Development: Harish

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page