జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌10కు నేటి నుంచి కౌంట్‌డౌన్‌

0 17

సూళ్లూరుపేట ముచ్చట్లు :

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం ఉదయం 5.43 గంటలకు సూళ్లూరుపేటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌ 10 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని కోసం బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఇస్రో చైర్మన్‌ శివన్‌ నేతృత్వంలో షార్‌లో మిషన్‌ సంసిద్ధత సమావేశం జరిగింది. అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం ఉదయం 5.43కు ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌(ఈవోఎస్‌)–03తో జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Countdown to GSLV-F10 from today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page