తెరపైకి నయీం డైరీ

0 18

హైదారాబాద్ ముచ్చట్లు:

కరుడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వేల కోట్లు కొల్లగొట్టిన నయీం కేసును ఐదేళ్లైనా సిట్ విచారణ కొనసా..గుతూనే ఉంది. ఈ కేసులో కమిషన్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఏకంగా ప్రధాని, గవర్నర్‌కి ఫోరం లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నయీం ఎన్‌కౌంటర్ కేసులో సిట్ దర్యాప్తు ఆశాజనకంగా సాగడం లేదని ఫోరం కార్యదర్శిపద్మనాభ రెడ్డి అన్నారు. ఓ టీవీ చానల్‌తో మాట్లడిన ఆయన నయీం కేసు తేలేంత వరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు.నయీం ఎన్‌కౌంటర్ జరిగి ఐదేండ్లు పూర్తైనా నేటికీ కేసు విచారణ కొలిక్కిరాలేదని పద్మనాభ రెడ్డి అన్నారు. నయీం నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడన్నారు. ఇలాంటి కేసుల్లో సమగ్ర విచారణ జరగకపోతే నయీం వంటి గ్యాంగ్ స్టర్లు మళ్లీ పుట్టుకొచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పరారీలో ఉన్న నయీం వ్యక్తిగత అనుచరులు, ఆర్మీ సభ్యుల ఆచూకీ ఎందుకు దొరకలేదని ఆయన ప్రశ్నించారు.ఎన్‌కౌంటర్ అనంతరం నయీం ఇంట్లో సోదాలు చేస్తే భారీగా డాక్యుమెంట్లు, డైరీలు, నగలు, నగదు లభ్యమైందని పద్మనాభ రెడ్డి చెప్పారు. వేల ఎకరాలకు సంబంధించిన 340 భూ డాక్యుమెంట్లు, భారీగా నగలు, పేలుడు పదార్థాలు, 24 తుపాకులు, బుల్లెట్ ఫ్రూప్స్ జాకెట్స్, నగదు స్వాధీనం చేసున్నారని ఆయన అన్నారు. రెండురోజులు కౌంటింగ్ మెషీన్లు పెట్టి డబ్బులు లెక్కిస్తే.. సిట్ మాత్రం రూ.3.70 లక్షలు మాత్రమే దొరికాయని సిట్ చెబుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.నయీం ఇంట్లో లభించిన డైరీల వ్యవహారం ఎందుకు బయటపెట్టడం లేదని పద్మనాభ రెడ్డి ప్రశ్నించారు. నయీం ఇంట్లో 130 డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. వాటిలో అతనితో సంబంధం ఉన్న అందరి పేర్లు ఉన్నాయని ఆయన అన్నారు. డైరీలు బయటపెడితే రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు బయటిపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డైరీలు బయటపెట్టాలని ఇప్పటికే సిట్ అధికారులను, ఆర్టీఐ, హైకోర్టుని అడిగామని.. కానీ బయటపెట్టలేదని ఆయన చెప్పారు.నయీం ఎన్‌కౌంట్ జరిగిన తర్వాత ఈ ఐదేళ్లలో ఏ ఒక్క బాధితుడికీ న్యాయం జరగలేదని పద్మనాభ రెడ్డి అన్నారు. నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులకు కూడా సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని.. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లను తప్పించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని, గవర్నర్‌కి లేఖలు రాశామని.. తక్షణమే సిట్ స్థానంలో కమిషన్ నియమించి బాధితులకు న్యాయం చేయాలని లేఖలు రాశామని ఆయన తెలిపారు.నయీం కేసు తేలేంత వరకూ వదిలేని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంది. నయీం కేసులో ఏం పురోగతి సాధించారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ఫోరం ఏకంగా ప్రధానికి లేఖలు రాయడంతో డొంక మళ్లీ కదలబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Naeem Diary on screen

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page