పేదలకు సహాయం చేయడం అభినందనీయం -ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య

0 9

ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో   నిత్యవసర సరుకులు పంపిణీ

ములుగు ముచ్చట్లు:

 

 

- Advertisement -

చిన్న వయస్సులోనే పేదలకు సహాయం చేయడం అభినందనీయమని ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఆన్నారు.ములుగు జిల్లాలోని పాత గోదాం అవరణలో గుడారాలు వేసుకొని నివసించే దాదాపు 30 నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఇల్లు మరియు గుంట భూమి కూడా లేకుండా అక్కడక్కడ నివాసం ఉండు కుంట కాలం ఏళ్ళదిస్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆకుతోట అన్వేష్ బుధవారం రోజున   ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి 5 కిలోల బియ్యం మరియు 9 రకాల నిత్యవసర సరుకులు (పసుపు, కారం,ఉప్పు,అల్లం,సబ్బులు,చెక్కెర, చపత్త, కాల్గాటే పేస్ట్,నూనె) వస్తువులను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య  మరియు సిఐ శ్రీధర్ హాజరై సరుకులను అంధియడం జరిగింది. ఏఎస్పీ మాట్లాడుతూ అన్వేష్ ఇంత  చిన్న వయసులోనే  పేదలకు సహాయం చేసే కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరం అదేవిదంగా ఇలానే చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాలింటర్స్ అకుతోట సంపత్, సిద్దు, నాగరాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:Helping the poor is commendable -Mulugu ASP grandson Sai Chaitanya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page