ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరగాలి-మంత్రి సబితా ఇంద్రారెడ్డి

0 9

రంగారెడ్డి ముచ్చట్లు:

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం  మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 డివిజన్ లోని పెద్ద చెరువు కట్ట వెడల్పు,చెరువు సుందరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం శంకుస్థాపన చేసారు. మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా అవాకులు,చవాకులు పేలుస్తున్నారని అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అన్నారు. భవిష్యత్ తరాల కోసం చెరువులను సుందరీకరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ట్రంక్ లైన్ కు వర్షపునీటిని  కలపకూడదు అని కాలనీ వాసులకి, ప్రజా ప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ప్రతిపక్షాలు,కాలనీవాసులు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్ కుమార్, మేయర్,డిప్యూటీ మేయర్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Development should be done keeping in view the needs of the people-Minister Sabita Indrareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page