ప్రభుత్వ స్కూళ్లల్లోమౌలిక వసతులు

0 12

నూజివీడు     ముచ్చట్లు:
అటానమస్ సెంటర్గా నూజివీడు పిజి సెంటర్ ను తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  అన్నారు. బుధవారం నాడు నూజివీడు కృష్ణా  యూనివర్సిటీ  (పి జి సెంటర్)లో ఎకాడమిక్ బ్లాక్ శంకుస్థాపన చేసారు. 6 కోట్లతో నిర్మించనున్న  నూతన ఎకడమిక్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణ యూనివర్సిటీ రిజిస్టర్ వై కె సుందర్, వైస్ ఛాన్స్లర్ చంద్రశేఖర్ తదితరుల తో  మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా చరిత్ర గల టీవీ సెంటర్కు పరిపాలన లేకపోవడం బాధాకరం. విద్య పై ఉన్న మక్కువతో జమీందార్లు ఈ ప్రాంతాన్ని విద్యా సంస్థలు స్థాపించి ఎంతో అభివృద్ధి చేశారు. వాషింగ్టన్ డి సి లో నూజివీడు క్లబ్బు పెట్టడం గొప్ప విషయం. భవనాల ద్వారా చరిత్రకు పేరు రాదు విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం ద్వారా సాధ్యమవుతుంది. నేటితరం అవసరాలకు అనుగుణంగా విద్యాలయాలు మార్పులు చెందాలి. ఇంజనీరింగ్ విద్యలో ఇంటర్న్  షిప్ ద్వారా విద్యార్థులు నైపుణ్యం సంపాదించుకోవాలి. 3600 కోట్లతో నాడు స్కూల్ నేడు స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. 2 సంవత్సరాల కాలంలో ప్రాథమిక విద్య లో మార్పులు చేసి  నిధులు మంజూరు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.  కార్పొరేట్ స్కూల్లో దీటుగా ప్రభుత్వ స్కూల్లో అనేక మౌలిక వసతులతో రూపాంతరం చెందిందని అన్నారు.
జూనియర్ కళాశాలలో కార్పొరేట్ చేతిలో ఉండేవి గత ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేశాయి ఎల్ కే జి నుండి తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్స్ గా తీర్చిదిద్దేందుకు విద్యా విధానంలో అనేక మార్పులు చేర్చాం. 45 సంవత్సరాల నుండి పిజి సెంటర్ లో ఉన్నత స్థాయికి రాకపోవడం చాలా బాధాకరం అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇతర సబ్జెక్టులలో పి జి సెంటర్ లో ఉండేలా చర్యలు చేపడతాం.  ఛాయిస్ బేస్ లు క్రెడిట్ సిస్టం ద్వారా విద్యార్థులు సబ్జెక్టులు మార్చు కునే విధంగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Infrastructure in public schools

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page