బీసీ బంధు ప్రవేశపెట్టాలి

0 4

హైదరాబాద్   ముచ్చట్లు:
రాష్ట్రంలో దళిత బంధు పెట్టినట్లే బీసీ బంధు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు  మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు  డిమాండ్ చేశారు.  ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 127  అమెంట మెంట్  బిలు  ప్రవేశ పెట్టారు  దానిలో కొత్తదనం ఏముందని ఆయన ప్రశ్నించారు దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు  చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ లలో కూడా చాలా మంది పేద ప్రజలు ఉన్నారని వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి  చెందాలంటే హుజురాబాద్ లో ప్రవేశ పెట్టబోతున్న దళిత బంధు తరహాలోనే రాష్ట్రమంతటా బిసి బంధు ప్రవేశపెట్టాలని లేదంటే  అందరికీ న్యాయం జరిగే ల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.    అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్లో పెట్టించిన  కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విడుదల చేస్తే అసలైన దళిత ప్రేమికుడు అవుతాడని హనుమంతరావు అన్నారు..

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:BC Bandhu should be introduced

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page