బైకు-లూనా ఢీ…ముగ్గురికి గాయాలు

0 6

నాగర్ కర్నూలు  ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం తుమ్మలపల్లి గేటు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి పై ఎదురెదురుగా వస్తున్న బైకు-లూనా ఢీ కొన్నాయి. హైదరాబాద్ కు  చెందిన సుగుణమ్మ తలకు బలమైన గాయం తగలడంతో రక్తస్రావం జరిగింది. హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు.గాయపడ్డ వారిలో వంగూరు మండలం చౌదర్ పల్లికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి కుడి కాలు విరిగింది.  హైదరాబాద్ కు చెందిన సంతోష్  తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Three injured in bike-luna collision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page