భవిష్యత్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో రాష్ట్రంలోని అగ్రో రైతుసేవా కేంద్రాల నిర్వహకులకు అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్ లో మేనేజ్ సంస్థ సహకారంతో ఆగ్రోస్ నిర్వహిస్తున్న 45 రోజుల ప్రత్యేక శిక్షణ తొలివిడత శిబిరాన్ని  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  అగ్రోస్ ఎండీ రాములు,  మేనేజ్ ప్రిన్స్ పల్ కో ఆర్డినేటర్ ఎస్ ఎస్ పండ్,  మేనేజ్ డీజీ చంద్రశేఖర్ తదితరులు  హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షం. భవిష్యత్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే. ఏ రంగంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఉపాధి లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత పారిశ్రామీకరణ పెరిగింది. 15 లక్షల మందికి ప్రత్యక్ష్య, పరోక్ష ఉపాధి లభించింది. కరంటు సౌకర్యం లేక సమైక్య పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ దుస్థితి నుండి బయటకు వచ్చామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలో అత్యధిక పరిశ్రమలు వచ్చింది తెలంగాణకే. తెలంగాణ గ్రామీణ వ్యవస్థ ముఖచిత్రం మారిపోయింది. పాశ్చాత్య దేశాలలో గ్రామీణ, పట్టణ వ్యవస్థకు తేడా ఉండదు. గ్రామాలలోనయినా, పట్టణాల్లో అయినా మౌళిక వసతులు, ఉపాధి అవకాశాలు ఉండాలని అన్నారు.గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు .. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే వారికి ఉపాధి అవకాశాలు లభించాలి. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఅర్  ముందుచూపుతో వివిధరంగాలలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు.  అగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు వైవిధ్యంగా,  సృజనాత్మకతతో కేంద్రాన్ని నిర్వహించాలి. ఆధునిక ప్రపంచంలో మనం ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత మానసిక ధైర్యంతో ముందుకుసాగాలి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో కేసీఆర్ గారి వెంట నిలబడి ఉద్యమం చేశాం .. ఏ రోజూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ప్రతిభ దాగి ఉంటుంది .. దానిని గుర్తించి ఎవరికి వారే పదును పెట్టుకోవాలి. పురుగుమందులు, విత్తనాలు, ఎరువుల అమ్మకాలకే పరిమితం కావద్దు. క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించి యూనిట్లు ఎంపిక చేసుకోవాలి. శిక్షణార్ధులకు 36 శాతం సబ్సిడీపై బ్యాంక్ రుణాలు వుంటాయి. ఎంచుకున్న యూనిట్ ను విజయవంతంగా కొనసాగించి ఆర్థికంగా స్థిరపడాలి. అగ్రో కేంద్రాల నిర్వాహకులు రైతులకు భారంగా కాకుండా ఉపయుక్తంగా ఉపకరణంగా ఉండాలని అన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:The future is agro-based industries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page