భారత విమానాలపై బ్యాన్‌ను పొడిగించిన కెనడా!

0 10

కెనడా ముచ్చట్లు :

 

కెనడా మరోసారి భారతీయ విమాన సర్వీసులపై బ్యాన్‌ను పొడిగించింది. భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న తొలిసారి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాన్‌ను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఐదోసారి నిషేధాన్ని పొడిగించింది. అయితే, కార్గో, ఇతర అత్యావసర విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. సెప్టెంబర్ 21, రాత్రి 11.59 గంటల వరకు భారత్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై బ్యాన్ కొనసాగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Canada extends ban on Indian flights

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page