యాప్ ద్వారా 15 కోట్ల చీటింగ్

0 59

కడప  ముచ్చట్లు:

డబ్బులు ఊరికే రావు అని అందరికి తెలుసు. కానీ ఎలాగోలా, ఎదో ఒక రూపంలో ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించాలనే ఆశనే మనిషిని నిలువునా ముంచేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఆన్ లైన్ షాపింగ్ యాప్‌లో గ్రాబింగ్ చేస్తే ప్రతి రోజు కమీషన్ రూపంలో ఊరికే డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కొన్ని కోట్ల రూపాయలను.. కొన్ని వందల మంది మోసపోయారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఇన్ని వందల మంది ఎలా మోసపోయారు? ఆ ఆన్ లైన్ యాప్ ఏంటో చుద్దాం?డప జిల్లా కేంద్రంగా ఆర్సీసీ అనే ఆన్ లైన్ యాప్‌లో షాపింగ్ గ్రాబింగ్ ద్వారా పెద్ద మోసం జరిగింది. అదేదో ఒక లక్ష, రెండు లక్షలు కాదు. సుమారు 15 కోట్ల రూపాయలు పైగా స్కామ్. మోసపోయిన బాధితులు దాదాపు1000 మందికి పైగా ఉంటారని తెలుస్తోంది. నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని చేసిన మోసం ఇదంతా. జిల్లాలోని మైదుకూరులో కొందరు యువకులు ఉద్యోగం కోసం గూగుల్ సెర్చ్ చేస్తూ ఉండగా ఈ ఆన్ లైన్ ఆర్సీసీ యాప్ వెలుగులోకి వచ్చింది.. మొదట కొందరు కాల్ చేసి ఆర్సీసీ ఆన్ లైన్ యాప్ గురించి వివరించి దాని నుంచి వచ్చే ఆదాయాలు అన్ని వివరించి, వారికి వాట్సప్ ద్వారా ఒక లింక్ పంపారు. దానిని డౌన్ లోడ్ చేసుకున్న వారు మరికొందరికి షేర్ చేయడంతో బాధితులు ఎక్కువ అయ్యారు. అయితే ఈ ఆర్సీసీ అనే ఆన్ లైన్ యాప్ ఎలా పనిచేస్తుంది.. దాన్ని ఎలా వాడతారో ఓసారి చుద్దాం.ముందుగా ఆర్సీసీ ఆన్ లైన్ యాప్‌ని లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్‌తో లాగిన్ కావాలి. లాగిన్ అయ్యాక మొదటి స్టేజ్‌లో 3000 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. ఆ 3000 రూపాయలతో యాప్‌లో ఉన్న షాపింగ్‌లో ఉన్న వస్తువులు పై ఒక క్లిక్ చేస్తే చాలు. ఆటోమాటిక్ గా కమీషన్ వాళ్ళ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఇందులో 3000 నుంచి 6 లక్షల వరకు కూడా రీచార్జి చేసుకునే వీలుంది. ఎక్కువ రీచార్జి చేస్తే, ఆదాయం ఎక్కువగా వస్తుందని, ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు అని ఆశ చూపిస్తారు. దీనితో ఎక్కువ ఆదాయం కావాలనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో బాధితులు రీచార్జి చేసుకొని ఉన్నారు.ఇలా ప్రతి రోజు షాపింగ్ గ్రాబింగ్ చేసి క్లిక్ చేస్తే కమీషన్ రూపంలో మనం రీచార్జి చేసుకున్న అమౌంట్‌కి డబ్బులు యాడ్ అవుతూ ఉండడాన్ని చూసి నిజమని చాలా మంది బాధితులు నిజం అని నమ్మారు. ఇదే చాలా మంది బాధితులు నమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బులు రీచార్జి చేసుకుని పక్కన ఉన్న స్నేహితులుకి రిఫర్ చేసారు. ఫ్రెండ్స్‌కి రిఫర్ చేసినందుకు కమీషన్ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పడంతో ఇది ఒక 10 మంది నుంచి 1000 మంది బాధితులుగా మారిపోయారు. ఇది కడప జిల్లా మొత్తం ఒక చైన్ సిస్టంలా మారిపోయింది.అయితే కొన్ని రోజుల వరకు బాగానే కమీషన్ వస్తూనే ఉన్నా, సడెన్‌గా కమీషన్ రాకపోవడంతో పాటు వాళ్ళ రీచార్జి చేసుకున్న అమౌంట్ విత్ డ్రా చేసుకోవడానికి వీలు కాకపోవడంతో మోసపోయారని అర్థమై, ఆర్సీసీ ఆన్ లైన్ కాంటాక్ట్ పర్సన్స్‌ని అడగడంతో మధ్యలో కట్టిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు కడితే తప్ప మీ కమీషన్లు గానీ, అసలు డబ్బు గానీ ఇవ్వమని చెప్పడంతో బాధితులు కంగుతిన్నారు. మోసపోయామని తెలుసుకుని తమకు న్యాయం చేయమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ని కలిసి ఫిర్యాదు చేసారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:15 crore cheating through the app

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page