రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ‘శేఖర్’ షూటింగ్ మళ్లీ షురూ

0 17

 

సినిమా ముచ్చట్లు:

- Advertisement -

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో చిత్రీకరణ పునఃప్రారంభించాం. ఇందులో హీరో రాజశేఖర్ గారితో పాటు హీరోయిన్ అను సితార, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారు. కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేశాం. రాజశేఖర్ గారి సరసన మరో కథానాయికగా ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని నటిస్తున్నారు” అని చెప్పారు.   నిర్మాతలు మాట్లాడుతూ “రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. ఇప్పుడు ఈ అరకు షెడ్యూల్ తో 75 శాతం సినిమా పూర్తవుతుంది. సుమారు 20 రోజుల పాటు, నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్ లో ఐదు రోజులు షూటింగ్ చేశాక… శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ లో వారం షెడ్యూల్ ప్లాన్ చేశాం” అని అన్నారు.
ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: దత్తాత్రేయ, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లలిత్.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:The shooting of ‘Shekhar’ starring Rajasekhar as the hero has started again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page