వైఎస్సార్ అవార్డుల ఉత్యవాలు వాయిదా

0 5

అమరావతి  ముచ్చట్లు:
వైయస్సార్ లైఫ్టైం ఎచీవ్మెంట్, వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:YSSAR Awards Ceremony Postponed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page