సీపీఐ ధర్నా

0 7

కొత్తగూడెం  ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చండ్రుగొండలో ఫారెస్ట్ అధికారుల దాడికి గురై మృతి చెందిన భాగం వెంకటేశ్వర్లు అనే రైతు మృతిని నిరసిస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల పేరుతో అమాయక గిరిజనులను ఒక వైపు వేధింపులకు గురి చేస్తూ, మరోవైపు పోలీసు అధికారులను చేతిలోకి తీసుకొని ఫారెస్ట్ వారు గిరిజనులను వారి భూముల్లోంచి వెళ్లగొడుతూ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.   అడవిలోకి గేదెలను మేపటానికి వెళ్ళిన భాగం వెంకటేశ్వర్లు అనే అమాయక రైతుపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి కొట్టి చంపారని తీవ్రంగా విమర్శించారు.దీనిని ఫారెస్టు వారు చేసిన హత్య గా పేర్కొన్నారు. ఇందుకు కారకులైన వారిపై ఏమి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుని బంధువులు మాట్లాడుతూ భాగం వెంకటేశ్వరరావు పాడి గేదలు మేపుకోవడానికి వెళ్ళిన నేపధ్యంలో ఫారెస్ట్ అధికారి మదన్ లాల్  భాగం వెంకటేశ్వరరావు మేనల్లుడికి సాయంత్రం సమయంలో  ఫోన్ చేసి నానా దుర్భాషలాడారని,  వెంకటేశ్వరరావు ఇక్కడే పడి ఉన్నాడు అతని తీసుకుని వెళ్ళమని  సమాచారం ఇచ్చారని వాపోయారు. దీంతో తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుని బంధువులు తెలియజేశారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:CPI Dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page