హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్

0 14

కరీంనగర్ ముచ్చట్లు :

 

హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇతనే అభ్యర్థి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే బుధవారం నాడు కేసీఆర్ అధికారికంగా ఆయన పేరే ప్రకటించేశారు. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ ఉన్నారు. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గెల్లు అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో కెసిఆర్ ఆయన్ను ప్రజలకు పరిచయం చేయనున్నారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Gellu Srinivas as Huzurabad TRS candidate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page