హూజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్

0 33

కరీంనగర్ ముచ్చట్లు:

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసీఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే అంకితభావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలు కెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన గులాబి బాస్ కేసీఆర్ ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేశారు..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్వంత పార్టీ అభ్యర్థికే పట్టం కట్టనున్నారు. అది కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తినే పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో సూదీర్ఘ కాలం ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటలకు దీటుగా అంతే నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస యాదవ్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. మరోవైపు బీసి సామాజిక వర్గం కూడా కావడంతో పార్టీతోపాటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుండి ఎలాంటి విమర్శలు ఎదురు కాకుండా చూసుకున్నారు అధినేత కేసీఆర్.
ఇక, హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేసినా.. అనేక వ్యతిరేకతలు ఎదురుకావడంతో ఆయనకు ఎమ్మెల్సీతో సరిపుచ్చారు. మరోవైపు, బీసీ సామాజిక వర్గానికి ఎల్‌ రమణతోపాటు పెద్దిరెడ్డి, స్వర్గం రవి లాంటి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించినా.. చివరకు పార్టీ కార్యకర్తకే పట్టం కట్టేందుకు టీఆర్ఎస్ బాస్ సిద్దమయ్యారు.
పేరుః గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌
విద్యా అర్హతలుః MA, LLB, ఓయులో Phd
తండ్రిః గెల్లు మల్లయ్య యాదవ్ కొండపాక మాజీ ఎంపీటీసీ
తల్లిః లక్ష్మి హిమ్మత్‌నగర్‌ మాజీ సర్పంచ్‌
సొంతూరుః వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌
రాజకీయ పస్థానంః
విద్యార్థి దశ నుంచి బీసీ సమస్యలపై పోరాటం
బాధ్యతలు వీణవంక మండలం టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు
2017 నుంచి టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (TRSV) రాష్ట్ర అధ్యక్షుడు
2003 నుంచి TRSVలో చురుకైన పాత్ర
తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర
వందకుపై కేసులు, జైలులో 36 రోజులు..

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Gellu Srinivas as Huzurabad candidate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page