ఈటలకు గుణపాఠం చెబుతారు:మంత్రి తలసాని

0 9

హైదరాబాద్  ముచ్చట్లు:
ఈటల రాజేందర్  గెల్లు శ్రీనివాస్ ను  పట్టుకుని బానిస అనడం భావ్యం కాదు.  ఇది  ఈటల అహాఁకారానికి నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  గురువారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు.  ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు. ఆ నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే.  ఈటెల హుజురాబాద్ లో బీసీ శామీర్పేటలో ఓసి.  హుజురాబాద్ ప్రజలు ఈటల కు గుణపాఠం ఈ ఎన్నికల్లో చెబుతారని అన్నారు.
ఉద్యమకారులకు టిఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుంది గతంలో సుమన్,కిశోర్ లాంటి వాళ్ల కు పార్టీ అవకాశం కల్పించింది. గెల్లు శ్రీనివాస్ కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారు. జానా రెడ్డికి  పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుంది.  గతంలో ఆరు సార్లు కెసిఆర్ దయాదాక్షిణ్యాల పైన విజయం సాధించారు . బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Yitala is said to be a lesson: Minister Talasani

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page