ద్విచక్ర వాహనాదారుడిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం

0 23

ఆక్టివా వాహనంపై కిందపడిన వృద్దుడు
గాయాలైన వృద్దున్ని అక్కడే వదిలి వెళ్లిన పోలీసులు
గాయపడ్డ యూసుఫుద్దీన్ ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్  ముచ్చట్లు:
సాక్షాత్తు చాంద్రాయణగుట్టపోలీస్ పెట్రోలింగ్ వాహనమే ఆక్టివా పై వెళ్తున్న వృద్దుని ఢీకొట్టింది. కనీసం గాయపడిన ఆ వృద్దున్ని  ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న సంగతే మరిచింది.  దీంతో ఘటన జరిగిన స్థలంలో ఉన్న ప్రత్యక్ష్య సాక్షులు గాయపడ్డ బాధితున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలలోకి వెళితే .. చాంద్రాయణగుట్ట పోలీస్టేషన్కు చెందిన టిఎస్ 09 పిఎ 5441 నెంబర్ గల పెట్రోలింగ్ వాహనంపై శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రాత్రి బండ్లగూడ నూరీ ఫంక్షన్ హాల్ వద్ద  అటుగా వెళ్తున్న  దారుల్షిఫా కుచెందిన షా మహ్మద్ యూసుఫుద్దీన్(65) ఢీకొట్టింది. ఆక్టివా పై నుంచి కింద పడిన యూసుఫుద్దీన్కుగాయలయ్యాయి. ఆ వృద్దున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న ఆలోచన పెట్రోలింగ్ కారులో ఉన్న పోలీసులు మరిచారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాంద్రాయణగుట్ట పెట్రోలింగ్ వాహనంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.  గాయపడిన యూసుఫుద్దీన్ను చికిత్స నిమిత్తం స్థానకులు ఓవైసీ ఆసుపత్రికి తరలించారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:A police patrol vehicle collided with a two-wheeler

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page