రెచ్చగొడుతున్న మంత్రి….

0 16

విజయవాడ ముచ్చట్లు:

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు సావ‌ధానంగా దానిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తారు. లేదా.. మౌనంగా ఉండి.. స‌ద‌రు స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు వేచి చూస్తారు. కానీ, ఓ మంత్రి మాత్రం.. ఎంత‌సేపూ..దూకుడు రాజ‌కీయాలు చేయ‌డంతోపాటు.. రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు చేస్తున్నార‌నే టాక్ బాగా వినిపిస్తోంది. ఆయ‌నే దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌. మంత్రిగా ఉంటూనే ఆయ‌న వాడి వేడి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హిందూ దేవాల‌యాలపై దాడులు జ‌రిగిన‌ప్పుడు.. విగ్ర‌హాల ధ్వంసం జ‌రిగిన‌ప్పుడు.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి.వాస్త‌వానికి మంత్రి పొజిష‌న్‌లో ఉన్న నాయ‌కుడు కాబ‌ట్టి.. పైగా త‌న శాఖ‌కే చెందిన విష‌యాలు కాబ‌ట్టి.. ఆయ‌న సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాలి. లేదా.. మౌనంగా ఉండాలి. కానీ, వెలంప‌ల్లి శ్రీనివాస్‌ స్ట‌యిలే వేరు. వివాదం ఎక్క‌డుంటే అక్క‌డ ఉండ‌డం ఆయ‌న నైజంగా మారింద‌ని సొంత పార్టీలోనే ఆయ‌నపై చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా కూడా ఆయ‌న వ్య‌వ‌హారం వివాదంగా మారింది. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఇక్క‌డి రైతులకు ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర వివాదం సాగుతున్న విష‌యం తెలిసిందే. త‌మ కు అమ‌రావ‌తే రాజ‌ధాని కావాల‌ని.. మూడు రాజ‌ధానుల‌కు ఒప్పుకోబోమ‌ని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు పైకి విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించేందుకు మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు.స్థానికంగా.. ఉన్న ఎమ్మెల్యేలు.. కూడా అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్న ఈ ప్రాంతంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌ ఎలాంటి అధికారిక కార్య‌క్ర‌మం లేక‌పోయినా.. ప‌ర్య‌టించ‌డం.. స్థానికంగా రైతుల‌ను రెచ్చ‌గొట్టిన‌ట్టే ఉంద‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. తాళ్లాయపాలెం శివస్వామి ఆశ్రమానికి మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌ వచ్చారు. మంత్రి వ‌చ్చిన విష‌యాన్ని తెలుసుకున్న రైతులు.. అక్క‌డ‌కు చేరుకుని.. అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలంప‌ల్లి శ్రీనివాస్‌ మంత్రి అయ్యాక దేవాలయాలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైతుల‌తో మాట్లాడి శాంతింప జేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ, వెలంప‌ల్లి శ్రీనివాస్‌ మాత్రం విసురుగా అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డం.. త‌న‌దైన శైలిలో చిరాకు ప్ర‌ద‌ర్శించ‌డం వంటివి.. రైతుల‌కు మ‌రింత ఆగ్ర‌హం క‌లిగించాయి. అంతేకాదు.. తాము ఇచ్చిన వినతి పత్రం తీసుకోక పోవడంతో “మినిస్టర్ డౌన్ డౌన్“ అని.. నినాదాలు చేశారు. అంతేకాదు.. దేవాదాయ శాఖ మంత్రి ప‌ద‌వికి.. వెలంప‌ల్లి శ్రీనివాస్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.. మొత్తంగా చూస్తే.. ఈ తతంగం అంతా.. మంత్రి రెచ్చ‌గొట్టే చ‌ర్యేన‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. ఇదే విష‌యంపై సొంత పార్టీలోనూ ఆస‌క్తిగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:Provocative Minister ….

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page