ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

APNGO District Committee meets MLA Kotamreddy

0 29

నెల్లూరు ముచ్చట్లు:
నూతనంగా ఎన్నిక కాబడిన   ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కమిటీ నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపిక కాబడిన జిల్లా కమిటీ వారు మాట్లాడుతూ తమ పై నమ్మకంతో అప్పగించిన పదవి బాధితులను నెరవేరుస్తూ , జిల్లాలో ఏపీ ఎన్జీవో సంఘం అభివృద్ధికి , సంఘ సభ్యుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం అం ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని కూడా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో సంఘం అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఏ సంఘమైన నా బలోపేతం కావాలంటే సంఘ సభ్యులందరూ ఏకధాటిగా ఐక్యత గా కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఏ.పి.ఎన్.జి.ఓస్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచల రావు, జిల్లా కార్యదర్శి నాయుడు వెంకట స్వామి, ఉపాధ్యక్షులు నందిమండలం ఆంజనేయ వర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొలగమూడి రమేష్ బాబు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:APNGO District Committee meets MLA Kotamreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page