యాదాద్రిలో బీజేవైఎం ధర్నా

0 2

యాదాద్రి  ముచ్చట్లు:
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బస్సు స్టాండ్ వద్ద బిజెవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.బస్సు స్టాండ్ ముందు బైఠాయించి స్థానికుల,భక్తుల బూట్లు పాలీష్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టి యాదగిరిగుట్ట బస్సు స్టాండ్ లో చెత్తను ఊడ్చారు బిజెవైఎం శ్రేణులు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు 33 నెలల నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు బిజెవైఎం నేతలు.ఉద్యోగాల భర్తీ చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు రోడ్డున పడే  పరిస్థితి నెలకొంటుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:BJYM dharna in Yadadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page