13 మృతదేహాలు వెలికితీత

0 9

సిమ్లా/హిమాచల్‌ ప్రదేశ్‌ ముచ్చట్లు :

 

కిన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టిపెళ్లలు తొలగించిన రక్షణా బృందాలు ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. క్షతగాత్రులను సమీప భవానగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ రెఖాంగ్‌ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగి పడిన విషయం విదితమే. ఆ సమయంలో రహదారిపై సుమారుగా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags; Extraction of 13 bodies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page